సమర్థవంతమైన నాయకత్వం ముంత ద్వారా రుజువైంది
విశాలాంధ్ర నందిగామ:-కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వలన ముంత తుఫాన్ ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆస్తి నష్టం ప్రాణం నష్టం లేకుండా ప్రజలకు అండగా నిలిచామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ముంపు ప్రాంతాలలోని వారిని నందిగామ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సౌకర్యాలు అందించడమే కాకుండా 100 మత్యాకార కుటుంబాలకు ప్రభుత్వ ఆసరా ద్వారా 50 కేజీల బియ్యం వంటనూనె పంచదార ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మరియు నిత్యవసర సరుకులు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక కూటమి నేతలతో కలిసి ఆమె వరద బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంత తుఫాన్ ప్రభావం తో ముంపు ప్రాంతాల వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారిని పునరావాసు కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే చూసుకుందని అన్నారు అదే కాకుండా ముందస్తు చర్యల ద్వారా ప్రజలు కూడా అలర్ట్ గా ఉండి ముంత తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు సమర్థవంతమైన నాయకుని పాలనలో ప్రజలకు ఎటువంటి వికట్లు ఉండవని మరోసారి రుజువు అయిందని ఆమె అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులను సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు ఒక ఐక్యంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ తుపాను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి దోహద పడిందని పేర్కొన్నారు అంతేకాకుండా స్థానిక నాయకత్వం అలాగే అధికారులు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ సమస్య ఉన్న ప్రతి చోటికి తమతో కలిసి నడుస్తూ తుఫాన్ ప్రభావాన్ని ప్రజలపై పడకుండా కాపాడగలిగామని అన్నారు దీని ద్వారా ప్రభుత్వ నిబద్ధత ప్రతిబందించిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ,మున్సిపల్ కమిషనర్ లోవరాజు, ఎమ్మార్వో సురేష్, వివిధ శాఖల అధికారులు కూటమి నేతలు స్థానిక బాధ్యులు విరివిగా పాల్గొన్నారు….


