Homeఅంతర్జాతీయంఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు

ఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు

- Advertisement -

ఘనంగా ఏఐటీయూసీ 106 వ ఆవిర్భవ  దినోత్సవం 

కార్మికులకు విప్లవ శుభా కాంక్షలు తెలియజేసిన 

 ఏ ఐ.టి..యు.సి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కరరావు 

విశాలాంధ్ర – నిడదవోలు : ఏఐ.టి.యు.సి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిడదవోలులో ఎ.ఐ.టి.యు.సి. ఏరియా  సమితి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భముగా పలు కార్మిక  సంస్థల వద్ద ఎ.ఐ.టియుసి పతకాల్ని  ఆవిష్కరించిన  ఎ.ఐ.టి.యు.సి  నాయకులు  కార్యకర్తలు నిడదవోలు మెయిన్ రోడ్ లో  పొట్టిశ్రీరాములు విగ్రహము వద్ద శ్రీ వెంకటేశ్వరా జట్ల సంఘం ఆధ్వర్యంలో ఎ. ఐ.టియుసి పతకాన్నిఎ.ఐ.టి.యు.సి. నాయకులు రేఖా భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భముగా  రేఖా భాస్కరరావు మాట్లాడుతూ  1920 అక్టోబరు 31 వ తేదీన  ఏర్పడిన ఎ.ఐ.టి.యు.సి. దేశం లోనే ప్రప్రథమ కార్మికసంస్థ  అని స్వాతంత్ర్యపోరాటములో  ఎ.ఐ.టియుసి కీలక పాత్ర పోషించిందని. శ్రామిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి.  పాత్ర మరువ లేనిదన్నారు .కార్మిక చట్టాల రూప కల్పనలో , కార్మిక హక్కుల పరిరక్షణలో ఎ.ఐ.టి.యు.సి. పాత్ర చిరస్మరణీయమని , ప్రస్తుతం కేంద్రంలో మతోన్మాద బి.జె.పి. ప్రభుత్వం కార్మిక హక్కుల పై దాడి చేస్తుందని, కార్పోరేట్లు కు అనుకూలంగా  44 కార్మిక చట్టాలను 4, కోడ్ లు గా మార్చిందని, యిప్పటికే  29 కార్మిక చట్టాలు రద్దుచేసిందని  ,  విశాఖ స్టీల్ సహా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకున్నదని , దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆదివాసీలు,గిరిజనులు, దళితులు,మహిళలు , మైనారీటిల పై దాడులు పెరిగాయని, కేంద్రం లో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని , దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నరేంద్రమోదీ కి అనుకూలంగా  కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, కార్పొరేట్లును ప్రసన్నం చేసుకోవటానికి 12 గంటల పనిదినానికి చట్టం చేసిందని , విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడంలో ఘోరంగా  విఫలమయిందని, ప్రత్యేక హోదా మాటే మార్చి పోయిందని , ఎన్నికల వాగ్దానాలు అమలులో విఫలమైందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు భవిష్యత్ పోరాట కార్యక్రమానికి  ఏఐటీయూసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపిచ్చారు -కార్యక్రమంలో  ఎ. ఐ.. టి.యు.సి, నాయకులు మాముడూరి నాగేంద్ర వర ప్రసాద్ , మెయిలి శ్రీను, రామిశెట్టి సత్తిబాబు, బీజా అప్పారావు,కోసూరి శ్రీను,,  మామిడిసన్యా సిరావు, రొంగల శ్రీను, పెంటపాటి వెంకట్రావు,  బద్ది సూరిబాబు,చోడిశెట్టి లోవరాజు , జల్లా వెంకటేశులు,   నంద్యాల వీర్రాజు పొలిమాటి తాతబ్బాయి,, గాడిరవి,  ఖండవల్లి మాణిక్యం,క్రొవ్విడి నాగరాజు, క్రివ్విడి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు