Homeఆంధ్రప్రదేశ్అబ్బురపరిచిన వీర జవాన్ రేఖా చిత్రం

అబ్బురపరిచిన వీర జవాన్ రేఖా చిత్రం

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో వంగలపూడి గ్రామ పంచాయితీ పరిధిలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా శైలజ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీర జవాన్ ల పై విద్యార్దులకు అవగాహన కల్పించడంలో బాగంగా విద్యార్దులకు రేఖా చిత్రం పోటీలను నిర్వహించారు. దీనిలో భాగంగా తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్ధి ప్రశాంత్ గీసిన రేఖా చిత్రం అయిన మంచు కొండలో విధులు నిర్వహిస్తున్న సైనికుడు చిత్రం ప్రథమ బహుమతి పొందింది. ఈ సందర్భంగా ఉషా శైలజ మాట్లాడుతూ భారతదేశాని కాపాడడం కోసం కుటుంబాని విడిచి అనునిత్యం మంచు కొండలో, ఎడారుల్లో, నిలువు లోతు మురికి నీటిలో విధులు నిర్వహిస్తున్న వీర జవాన్ ల గురించి విద్యార్దులలో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వీరగాధ 5.0 కార్యక్రమం చేపట్టడం జరిగింది అని అన్నారు. దీనిలో భాగంగా విద్యార్దులకు జవాన్లు గురించి తెలిసేలా వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు