రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; అక్టోబర్ 28వ తేదీ మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో గుర్తి తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మరణించడం జరిగింది. ఈ సందర్భంగా అప్పటినుండి రూరల్ పోలీసులు విచారణ చేపట్టడంతో ఎట్టకేలకు మృతి చెందిన వ్యక్తి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి హైదరాబాదుకు చెందిన యాదాటి రాము అని (52 సంవత్సరాలు), ఇతని తండ్రి నాగభూషణ అని, భార్య ఆరు నెలల క్రితం చనిపోయిందని తెలిపారు. అప్పటినుండి మతిసిమతం లేకుండా తిరుగుతూ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. సదరి విషయంలో రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, ప్రచార మాధ్యమాల ద్వారా మృతి చెందిన వ్యక్తి వివరాలను కనుగొనడం జరిగిందని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి యొక్క వివరాలు లభ్యం..
- Advertisement -
RELATED ARTICLES


