Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంట్లో దొంగతనం కేసు నమోదు

ఇంట్లో దొంగతనం కేసు నమోదు

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం : విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని l3 కాలనీలో నాగేంద్ర ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి రెండు వెండి చైన్లు, నాలుగు గ్రాముల ఉంగరమును, ఆరు పట్టుచీరలు దోచుకుని పోయారని బాధితుడు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శనివారం రాత్రి ముత్యాలమ్మ పూజకు ధర్మవరంలోని తన అల్లుడు చంద్రశేఖర్ ఇంటికి పోవడం జరిగిందని, అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి బయట వాకిలి తెరువగా బీరువాలు పగలగొట్టి సొమ్ములు దోచుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. టూ టౌన్ సిఐ రెడ్డప్ప సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు