Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్లచే జీఎస్టీ పై అవగాహన -ర్యాలీ నిర్వహణ

గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్లచే జీఎస్టీ పై అవగాహన -ర్యాలీ నిర్వహణ

- Advertisement -

. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఐదవ రోజు ఎన్. ఎస్. ఎస్ ప్రత్యేక శిబిరము కొనసాగింపులో భాగంగా కే హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్మవరం: ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల చేత జి.ఎస్.టి పై భారత ప్రభుత్వం కల్పిoచిన వెసులుబాటు అదే విధంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థిక, బ్యాంకింగ్ జీరో బ్యాలెన్స్ ఖాతా, తెరవడంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజాలకు/వినియోగదారులకు అవగాహన కల్పించారు అని తెలిపారు. ప్రధాన మంత్రి రోజ్ గారి యోజన , సుకన్య సమృద్ధి యోజన ,వ్యక్తిగత , కుటుంబ బీమా, కుటుంబ రక్షణకు ఉపయోగపడే వివిధ పథకాలను గ్రామ ప్రజలకు వివరించి, గొట్లూరు గ్రామంలో ర్యాలీ కార్యక్రమం విజయవంతమైంది అన్నారు. అనంతరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా బి.గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పి. నరసమ్మ విచ్చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమoలో జీ. ధనుంజయ, బి.ఆనంద్, టి.లక్ష్మీనారాయణ, టి.చంద్ర కళా, ఎన్. ఎస్. ఎస్. వాలంటీర్లు , విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు