జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో నవంబర్ 7వ తేదీ నుండి 10 తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ జిల్లాపోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి బి.నీఖ్యశ్రీ , యం.యశస్విని, వైష్ణవి, అలేఖ్య, నలుగురు బాలికలు, అలాగే బాలుర విభాగంలో సంజయ్ కుమార్ ఏకంగా ధర్మవరం పట్టణానికి చెందిన 05 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 28వ తేదీన అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎంపిక నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు తెలిపారు.వీరి ఎంపిక పట్ల , జయ చంద్రారెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులు బుధవారం రోజున బయలుదేరి విశాఖపట్నం కి వెళ్లారు.
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


