విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి దగ్గరలోనే వున్నాయి. అరకొర వర్షానికి నీరు కారుతోంది. దీంతో పై కప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. .బుధవారం అరకొర వర్షం పడడంతో పై కప్పు ఒకేసారి కూలి కిందపడిందని పోలీసులు శ్రీనివాసులు, రామలింగం సూర్యనారారణలు ఆవేధన వ్యక్తం చేశారు. స్టేషన్ లో పై కప్పు ఊడడంతో కంప్యూటర్ పెట్టుకోవడానికి కూడా నానా తంటాలు పడుతున్న ట్లు తెలిపారు. ఖైదీలను రాత్రివేళల్లో స్టేషన్ లో ఉంచుకోవడానికి కూడా ఇబ్బందులకు గురైతున్నట్లు తెలిపారు .సర్కిల్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వీటి పరిధిలో నల్లమాడతో పాటు ఓడిచెరువు, అమడగూరు మండలాలు వున్నాయి. పోలీస్ స్టేషన్ కు, క్వాటర్స్ కు సంబంధించి దివంగత మాజీ మంత్రి అగిశం వీరప్ప ఉచితంగా భూమిని పంపిణీ చేశారు. ప్రభుత్వం వీటిని గమనించి స్టేషన్ ఊరికి దూరంగా నూతనంగా నిర్మించాలని పోలీసులు, మండలం ప్రజలు కోరుతున్నారు.
శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్…
- Advertisement -
RELATED ARTICLES


