టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన సరస్వతి హత్య కేసులో మరొకరిని అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో భార్య సరస్వతి తో భర్త సాకే వెంకటరాముడు కలిసి నివాసం ఉండేవారని సరస్వతి పై అనుమానం పెంచుకున్నాడని ఆమెను హతమార్చాలని కొని, తన అక్క చిట్టెమ్మ, ఆమె భర్త రామాంజనేయులు, మరో అక్క వెంకటలక్ష్మి, వదిన రామాంజనమ్మ సహాయంతో సరస్వతిని ఈ ఏడాది సెప్టెంబర్ లో హత్య చేసి నరసింహులు, విజయ్ సహాయంతో పట్టణ సమీపంలోని గొల్లపల్లి వంకలో పూడ్చి పెట్టారని తెలిపారు. ఈ కేసు చేదింపులో భార్య సరస్వతిని భర్తే చంపినట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురుపై కేసు నమోదు చేయడం జరిగిందని వారిలో ఆరుగురిని ఇదివరకే అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వెంకటరాముడు బావ రామాంజనేయులు తప్పించుకుంటూ తిరుగుతుండేవాడని, ఇందులో భాగంగా అతడిని ధర్మవరం ఎల్సీకే పురం సమీపంలోని పీహెచ్సీ వద్ద ఉండగా అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. మొత్తం మీద హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేయడం జరిగిందని మరోసారి సిఐ రెడ్డప్ప తెలిపారు.
చెన్నై కొత్తపల్లి మహిళా హత్య కేసులో మరొకరు అరెస్ట్..
- Advertisement -
RELATED ARTICLES


