బాధను వ్యక్తం చేస్తున్న తల్లి జింకా సరోజమ్మ, కుమారుడు జింకా పవన్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; మా ఆస్తి మా భూములు మాకు ఇప్పించాలని కోరుతూ పట్టణములోని సత్యసాయి నగర్ కు చెందిన కీర్తిశేషులు జింక రామకృష్ణ భార్య జింక సరోజమ్మ, కుమారుడు జింక పవన్ కుమార్ తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జింక సరోజమ్మ, కుమారుడు జింక పవన్ కుమార్ మాట్లాడుతూ మా నాన్న జింక రామకృష్ణ మృతి చెంది 28 సంవత్సరాలు అవుతుందని, అప్పటినుండి ఇప్పటివరకు మాకు రావలసిన ఆస్తి భూములు రాకుండా అత్త జింక లక్ష్మమ్మ, బావ జింక రామాంజనేయులు, బావమరుదులు జింక చంద్రశేఖర్, జింక శ్రీనివాసులు అనేక ఇబ్బందులు పెట్టి, మమ్ములను మానసిక వేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. 2021 నుండి రూరల్ పోలీస్ స్టేషన్లో కాళ్లు అరిగేలా తిరిగామని, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్ఐలు మారిన మాకు మాత్రం న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలు భరించలేక తాము మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో తరదాచికుంటున్నామని తెలిపారు. మాకు రావలసిన ఆస్తి, పొలము అడిగితే మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకోండి అంటూ నానా దుర్భాషలాడుతూ మమ్ములను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. తీవ్ర పదజాలంతో మమ్ములను దూషించడం ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఆస్తి, మా భూమి అడగడంలో మా తప్పు ఏమీలేదని, వంశపరంగా మాకు రావలసిన వాటిని ఇమ్మని అడిగినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. మంత్రి సత్య కుమార్ కూడా తమ విన్నవించుకుంటున్నామని, మా బాధను అర్థం చేసుకొని సరి అయిన న్యాయం చేకూర్చాలని వారు వేడుకుంటున్నారు. అమ్మకు కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను పలుచోట్ల అప్పులు కూడా చేయడం జరిగిందని, చివరకు అప్పులు తీర్చలేక, అప్పుల బాధ అధికం కావడంతో ఏమి చేయాలో తోచక సతమతమవుతున్నామని తెలిపారు. ఇక మాకు చావే శరణ్యమని అనిపిస్తోందని వారు బాధను వ్యక్తం చేశారు. మా అత్త బావ బావ మరదలు ద్వారా మాకు రావలసిన ఆస్తిని ,పొలాన్ని సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు తమ బాధను వ్యక్తం చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో తెలిపారు. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ఆపమని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
మా ఆస్తి, మా భూములు ఇప్పించండి..
- Advertisement -
RELATED ARTICLES


