అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షులు నాగభూషణ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరము నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లమ్మ, కీర్తిశేషులు గోరకాతి పెద్దారెడ్డి జాపకార్థం వీరి కుమారులు గోరకాటి రఘునాథరెడ్డి, కోడలు గోరకాటి ప్రమీలమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. ఈ శిబిరంలో 125 మందికి కంటి వైద్య పరీక్షలను నిర్వహించగా అందులో 85 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. కంటి ఆపరేషన్లకు ఎంపిక కాబడిన వారందరికీ ఉచిత రవాణా ఖర్చు, ఉచిత వశతి, ఉచిత భోజనం, ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరంలో కంటి డాక్టర్ పవిత్ర కంటి రోగులకు వైద్య చికిత్సలను అందించి కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంటి శిబిరాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేస్తోందని, ఇప్పటికే పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర, కొండయ్య, శ్రీనివాసుల రెడ్డి, పెరుమాళ్ళ దాస్, రమేష్ బాబు, సత్రశాల ప్రసన్న కుమార్, జయసింహ, శివయ్య, బండారు వెంకటాచలం, అంబికా, సుదర్శన్ గుప్తా, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు పిఆర్ఓ .శివ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


