Homeజిల్లాలుకర్నూలుగ్రావెల్ తో గుంతలు పూడ్చివేత

గ్రావెల్ తో గుంతలు పూడ్చివేత

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామ శివారులో ఉన్న నాల్గో మైలు రాయి నుంచి పెద్దకడబూరు వరకు ప్రధాన రహదారిపై పడిన గుంతలకు టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి సహకారంతో బుధవారం గ్రావెల్ వేయించారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యన్న గౌడ్, దుమ్మల శివ మాట్లాడుతూ రహదారి గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రహదారిపై గ్రావెల్ వేయించినట్లు తెలిపారు. ముఖ్యంగా దొడ్డిమేకల వంక వద్ద బ్రిడ్జ్ పై గుంతలకు తాత్కాలికంగా గ్రావెల్ తో మరమ్మతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు దస్తగిరి, చాకలి నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు