ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరమని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 56 పాఠశాలల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నాలుగు చోట్ల అనగా గొట్లూరు లో ఉన్నత పాఠశాలలో, నాగలూరు లోని పీసీ ఎంఆర్ ఉన్నత పాఠశాలలో, చిగీ చెర్ల గ్రామంలో హై స్కూల్ పాఠశాలలో, దర్శనమల గ్రామంలో హై స్కూల్ పాఠశాల యందు ఈ ప్రత్యేక ఆధార్ క్యాపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నాయెడల, వాటిని ఈ కార్యక్రమంలో సరిచేసుకొని సక్రమంగా గల ఆధార్ క్యాంపును పొందాలని తెలిపారు. ఆధార్ క్యాంపు నమోదు కార్యక్రమంలో పారదర్శకతతో క్యాంప్ కేంద్రాలు నిర్వహించాలని తెలిపారు. కావున గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని హెడ్మాస్టర్లు తమ పాఠశాలలోని విద్యార్థులకు కేంద్రీకరించిన పాఠశాలలో ఆయా తేదీలలో వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు.
ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరం..
- Advertisement -
RELATED ARTICLES


