: గుంటూరు మహాసభకు ఘన మద్దతు
విశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న్యాయవాదులు విడుదల చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి, ప్రజాస్వామ్య విలువల నిలబెట్టడానికి ధర్మవరం న్యాయవాదులు ఐక్యంగా సంకల్పం ప్రకటించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 22, న గుంటూరులో జరగబోయే రాజ్యాంగ దినోత్సవ మహాసభకు ధర్మవరం తరఫున ఘన మద్దతు తెలిపారు.ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది అని న్యాయవాదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రి , ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు వివిధ జిల్లాల మేధావులు ఈ సభలో పాల్గొనబోతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఈడబత్తిని ప్రసాద్, నరసింహామూర్తి, భాస్కర్, పెద్దన్న, బాబా, అశోక్, రంగా నాయుడు, విశ్వనాధ్, శివ బాబు, ధర్మవరం బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్, పార్టీ కార్యదర్శి సాకే హరికుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం
- Advertisement -
RELATED ARTICLES


