పుట్టపర్తి, విశాలాంధ్ర: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఆనందానిచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం ఆయనకు సాయి శ్రీనివాస అతిథి గృహంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజ రత్నాకర్ స్వాగతం పలికారు.అనంతరం ఫడ్నవీస్ మహాసమాధిని దర్శించి కొంతసేపు ఆధ్యాత్మిక ధ్యానంలో మునిగిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం గత 50ఏళ్లుగా శ్రీ సత్యసాయిని ఆరాధిస్తున్నదని, ఆ ఆరాధన వల్ల తమ జీవితంలో ఎన్నో మరిచిపోలేని అనుభవాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.సత్యసాయి “అందరినీ ప్రేమించండి, అందరికి సేవ చేయండి” అనే సందేశంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన కొనియాడారు. నేడు మహాసమాధి దర్శనం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ నేతలు సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి మహా సమాది దర్శనం సంతోషకరం: ఫడ్నవీస్
- Advertisement -
RELATED ARTICLES


