_ గ్రామం నుండి పందుల తరలింపు
_ విశాలాంధ్ర కథనానికి స్పందన
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్షర యుద్ధం చేస్తున్న విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన ఇలా ఉంటే రోగాలు రావా..? అనే కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి కొండపి కృష్ణమోహన్ ఆదేశాలతో ఎంపీడీవో వై శంకర్ రావు డిప్యూటీ ఎంపీడీవో నారాయణ, పంచాయతీ కార్యదర్శి చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో పోకూరు గ్రామానికి చేరుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టి శానిటేషన్ చేయించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యుత్ సబ్-స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన చెత్తా, చెదారం వ్యర్ధాలు ఒకే ప్రాంతంలో గుట్టలుగా వేయడం వలన అవి కుళ్ళిపోయి ఉండడంతో పందులు, కుక్కలు స్వైర విహారంచేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపణలు చేయడంతో సోమవారం వార్త ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే… అధికారులు వెంటనే స్పందించడంతో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ప్రజలు సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన విశాలాంధ్ర దినపత్రికకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


