Homeజిల్లాలుఅనంతపురంతుప్పు పట్టిన గేట్లు.. నీటి సరఫరాకు అవరోధం.. వెంటనే మరమ్మత్తులు చెయ్యండి... ...

తుప్పు పట్టిన గేట్లు.. నీటి సరఫరాకు అవరోధం.. వెంటనే మరమ్మత్తులు చెయ్యండి… రైతు సంఘం డిమాండ్

- Advertisement -

రైతు సంఘం ఆద్వర్యం లో కలెక్టర్‌కు వినతిపత్రం

విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం:పెన్నహోబిళం కుడికాలువ గేట్లు, సుబ్బరాయ సాగర్ ప్రాజెక్టు గేట్లను వెంటనే మరమ్మత్తులు చేసి క్రింది గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు.రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున మాట్లాడుతూ
ఈ ఏడాది తక్కువ వర్షాల కారణంగా జిల్లాలో అనేక చెరువులు ఎండిపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో హెచ్‌ఎల్‌సి, హంద్రీ–నీవా ద్వారా నీరు జిల్లాలోకి వస్తోందని చెప్పారు. అయితే ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా నీరు క్రిందికి చేరకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.పీఏబీఆర్–ఎంపీఆర్, సుబ్బరాయ సాగర్ గేట్లు తుప్పు పట్టి నీరు విడుదలకు ఆటంకంగా మారాయన్నారు. గేట్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయకపోవడంతో పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు, సుబ్బరాయ సాగర్ కిందనున్న గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయిందని తెలిపారు.వేసవి మొదలుకాకముందే పలు గ్రామాలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిపుణులతో గేట్లను పరిశీలించి మరమ్మత్తు పనులు చేపట్టి క్రిందికి నీరు విడుదల చేయాలని మల్లికార్జున కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి, బండి రామకృష్ణ, సిపిఐ నగర సహాయ కార్యదర్శులు బి. రమణయ్య, వి. కృష్ణుడు, రాప్తాడు మండల కార్యదర్శి బండి రామకృష్ణ, అనంతపురం మండల కార్యదర్శి నరేష్, దుర్గాప్రసాద్, ఎల్లుట్ల నారాయణస్వామి, రాము, వెంకటరాముడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు