Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ధర్మవరంలో ప్రారంభం కానున్న “అటల్–మోడీ సుపరిపాలన యాత్ర”కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచ్చేయనున్న సందర్భంలో, కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లపై ఈ నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , డీఎస్పీలు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, పట్టణ, రూరల్ మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులతో కలిసి సభాస్థలి పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు. పరిశీలన సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు అవసరమైన నిర్మాణ సంబంధిత ఏర్పాట్లు, ముఖ్య అతిథుల రాకపోకలు సాఫీగా సాగేందుకు హైలీప్యాడ్ పనుల పురోగతి, కార్యక్రమానికి భారీ సంఖ్యలో విచ్చేయనున్న ప్రజల రద్దీ నిర్వహణ, వాహనాల పార్కింగ్‌ వ్యవస్థ, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, స్టేజ్ రూపకల్పన, పబ్లిక్ చెయర్స్ అమరిక, రూట్ మ్యాప్, సెక్యూరిటీ కారిడార్ వంటి అన్ని ముఖ్య అంశాలను సంబంధిత విభాగాల అధికారులతో కలిసి సమీక్షించి, అవసరమైన సూచనలు అందించారు. ప్రతి అంశంలో సమన్వయం బలోపేతం చేయాలని, కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సతీష్ కుమార్ అధికారులకు సమన్వయ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మహోత్సవ కార్యక్రమం ధర్మవరం పట్టణ ప్రతిష్ఠను మరింతగా ఎత్తిచూపేలా ఉండాలని, అటల్ బిహారీ వాజ్‌పేయి సేవలకు అంకితమైన ఈ చారిత్రాత్మక వేడుక ప్రజల సానుకూల పాల్గొననకు ఘనవిజయం సాధిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు