విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. ఈ కార్యక్రమం పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా వేణుగోపాల్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు లింగా రామ్మోహన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తాలూకా అసోసియేషన్ అధ్యక్షులుగా పెనుబోలు శంకర నారాయణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా శ్రీనివాసులు, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా గురు రాఘవేంద్ర, పెద్దన్న, ఎండి జీక్రా వెంకటేశులు, అసోసియేట్ అధ్యక్షులుగా ఉదయభాస్కర్, ట్రెజరీగా కృష్ణప్ప,ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సురేష్ నాయక్, సంయుక్త కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి, అనితమ్మ,, షఫీ ఉల్లా, రాజశేఖర్, జాహ్నవి, కోశాధికారిగా క్రిస్టపొలను ఎన్నిక చేశారు. ఎన్నికైన వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం టిడిపి సీనియర్ నాయకులు ఫణికుమార్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి జాతీయ నాయకులు అంబటి సతీష్ బాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేషు తదితరులు నూతన కమిటీ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర పాల్గొన్నారు.
ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం
- Advertisement -
RELATED ARTICLES


