Homeజిల్లాలుఅనంతపురంఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

- Advertisement -

: 0 -5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం అనంతపురం నగరంలో ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి.. ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఈనెల 21వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులు (0-5 సంవత్సరాల మధ్య) ఉన్నారని, జిల్లాలోని 31 మండలాల పరిధిలో 51 పిహెచ్సిలు, 25 యూపీహెచ్సీలు, 6 పిపియూనిట్లు కలుపుకుని మొత్తం 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,451, అర్బన్ ప్రాంతాల్లో 334 కలుపుకొని మొత్తం 1,785 పోలింగ్ బూత్ లలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. బూత్ యాక్టివిటీని డిసెంబర్ 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ఆరోజు మిగిలి పోయిన వారికి ఇంటింటి గృహ సందర్శన యాక్టివిటీని 22వ తేదీ మరియు 22వ తేదీన నిర్వహించడంజరుగుతుందన్నారు. ట్రాన్సిట్ ప్రాంతాలు బస్ స్టేషన్ల, రైల్వే స్టేషన్ల నందు 58 బృందాలు, మొబైల్ టీంలు 68 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలలోనూ ఐఇసి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, చిన్నారులు ఎవరు కూడా మిగిలిపోకుండా, అందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి.దేవి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, హెచ్ఈఈఓ త్యాగరాజు, డిప్యూటీ హెచ్ఇఈ గంగాధర్, వెంకటేష్ వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ డిఎస్వి రాజు, కిరణ్ కుమార్, వివిధ నర్సింగ్ కళాశాల విద్యార్థినీలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు