Homeఆంధ్రప్రదేశ్రైతు దేశానికి వెన్నెముక… పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి

రైతు దేశానికి వెన్నెముక… పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; రైతు దేశానికి వెన్నెముక అని రీషి పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో రైతు దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొలానికి వెళ్లి సాగు పనుల్లో పాల్గొన్నారు. విద్యార్థులు నేల దున్నడం, విత్తనాలు నాటడం వంటి వ్యవసాయ పనులు చేసి రైతుల కష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రైతుల ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు. రైతుల శ్రమ వల్లే సమాజం నిలబడుతోందని, రైతులను గౌరవించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా డీన్ భాస్కర్, ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్, సిపిఓ రవీంద్ర మాట్లాడుతూ రైతులు దేశానికి ఆధారస్తంభాలని, విద్యార్థులు చిన్ననాటి నుంచే వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. రైతుల శ్రమను గుర్తించి, వారి సేవలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏ ఓ రంగా రెడ్డి , విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు