Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంతో ముఖ్యమైనది

క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంతో ముఖ్యమైనది

- Advertisement -

కరస్పాండెంట్ ఎస్. చాంద్ భాషా
విశాలాంధ్ర ధర్మవరం:: క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనదని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఎస్. చాంద్బాషా తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. క్రిస్మస్ పండుగలను దృష్టిలో ఉంచుకొని చిన్నారులు వేసిన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. అనంతరం చాంద్ భాషా మాట్లాడుతూ యేసు ప్రభువు పుట్టిన నుంచి ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు. ప్రతి మనిషి స్వార్థము విడనాడాలని నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. కలిసిమెలిసి ఉంటే జీవితంలో సుఖము దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ నాగభూషణం, అకాడమిక్ ఇంచార్జ్ బినోయ్ ఫ్రాన్సిస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు