Homeజిల్లాలుఅనంతపురంపరిశుభ్రతను పెంపొందించడానికే చెత్త సేకరణ

పరిశుభ్రతను పెంపొందించడానికే చెత్త సేకరణ

- Advertisement -

-జెడ్పీ సీఈఓ జి. శివశంకర్

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడానికే చెత్త సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని జెడ్పీ సీఈఓ జి. శివశంకర్ అన్నారు. రాప్తాడు మండలం గొండిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని (సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్), ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నారా లేదా ఎంపీడీఓ బి. విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ బి.అశోక్ బాబు, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిప్యూటీ ఎంపీడీఓ కె. అచ్యుతానంద బాబు, సర్పంచ్ మిడతల శీనయ్య, పంచాయతీ కార్యదర్శి చల్లా ఉమాదేవితో కలసి తనిఖీ చేశారు. సీఈఓ మాట్లాడుతూ సేకరించిన చెత్తలో వేరు చేసిన వ్యర్థాల వల్ల రీసైక్లింగ్ రేటు పెరిగి చెత్త నిర్వహణ మెరుగై, భూమిలో వ్యర్థాలు పేరుకుపోకుండా నివారిస్తుందన్నారు.ప్రజలకు, అధికారులకు మధ్య సమన్వయం పెరిగి, పరిశుభ్రతపై అవగాహన కలుగుతుందన్నారు. సేకరించిన వ్యర్థాలతో ఆదాయాన్ని సమకూర్చుకునేలా వర్మీ కంపోస్టును తయారు చేయాలన్నారు. సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేసి గ్రామంలో పరిశుభ్రత మెరుగయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.నిర్దేశించిన యాప్ లో రోజువారి చెత్త సేకరణ వివరాలను అప్లోడ్ చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు