ఆర్ డి ఒ కేశవ నాయుడు
విశాలాంధ్ర -అనంతపురం : ఆడ పిల్లల ప్రాముఖ్యత పై గ్రామ స్థాయి లో అవగాహన కల్పించాలని
ఆర్ డి ఒ కేశవ నాయుడు పేర్కొన్నారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కేశవ నాయుడు అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ… ఆడ పిల్లల ప్రాముఖ్యత గూర్చి ప్రతి మండలంలో ఉన్న గ్రామాలలోఅవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీల ఉన్న ఎక్కువ బాల్యవివాహాలు జరిగిన గ్రామాలను ఎంచుకొని ఆ గ్రామాలలో సచివాలయం సిబ్బంది మరియు వైద్య శాఖ సిబ్బంది సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో యుక్త వయసు బాలికల తల్లిదండ్రులకు కనీసం నెల రోజులకు ఒకసారి బాల్యవివాహాలపై మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల అనర్థాలు దుష్పరిమాణాలు తెలియజేస్తూ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు , ఆరోగ్య సిబ్బంది మరియు మహిళా పోలీస్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పైలెట్ ప్రాజెక్టు మోడ్ లో తీసుకోవాలని సంబంధిత డిపార్ట్మెంట్ లకు ఆదేశించారు. లింగ నిర్ధారణ జరగకుండా ఆకస్మిక తనికీలు మరియు గట్టి నిఘా పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ నీ సార్ బేగం, పేతాలజిస్ట్ డాక్టర్ దివ్య, ఆర్ డి టి సంస్థ డాక్టర్ దుర్గేష్, పోలీస్ శాఖ శ్రీ విజయభాస్కర్, ఎస్సై, ఎన్జీవో రెడ్స్ సుశీల, ఐసిడిఎస్ శ్రీమతి సంధ్యారాణి, ఎచ్ ఈ ఈ ఓ త్యాగరాజు, డిప్యూటీ హెచ్ఈఓ, గంగాధర్, వేణుగోపాల్, వెంకటేష్, కిరణ్, శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్, ఆషారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఆడ పిల్లల ప్రాముఖ్యత పై గ్రామ స్థాయి లో అవగాహన కల్పించండి
- Advertisement -


