Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా నేషనల్ యూత్ డే వేడుకలు.. ప్రిన్సిపాల్ మల్లికార్జున

ఘనంగా నేషనల్ యూత్ డే వేడుకలు.. ప్రిన్సిపాల్ మల్లికార్జున

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఏ. పి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ బాలసుందరి ప్రిన్సిపాల్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యూత్ వేడుకలు ఈనెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలలో డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కొన్ని ఉదాహరణల ద్వారా వివరించారు. ప్రిన్సిపాల్ డా. మల్లికార్జున మాట్లాడుతూ దేశానికి యువతే శక్తి,సమాజం , దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కావున మన దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి మన శక్తి మేరకు ఐక్యంగా ఉండి డ్రగ్స్ రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. “సే ఎస్ టు లైఫ్ అండ్ నో టు డ్రగ్” అని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు