మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నియోజకవర్గ పరిధిలోని 26 మందికి రూ.14.32 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు స్థానిక ఎన్డీఏ కార్యాలయంలోపంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వ అండగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స ఖర్చులు భరించలేని కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని, అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధిని మరింత పారదర్శకంగా, వేగంగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ధర్మవరం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సహాయం అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకులేటి వీరనారప్ప, పోతులనాగేపల్లి లక్ష్మీనారాయణ, వడ్డే శినా, బోయ నరసింహులు, ఏలుకుంట్ల లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు నబి రసూల్, సొమ్లా నాయక్, రవి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
- Advertisement -
RELATED ARTICLES


