Homeజిల్లాలుఅనంతపురంగ్రామాల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం

గ్రామాల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం

- Advertisement -

-ఎంపీడీఓ బి విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి అన్నారు. గాండ్లపర్తి, జి.కొత్తపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో పల్లె పండుగ 2.0 లో భాగంగా రూ. 31 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లను నూతనంగా నిర్మించడానికి భూమి పూజ చేశారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. కార్యక్రమంలో జీ.ఎస్.డబ్ల్యు.ఎస్ డిప్యూటీ ఎంపీడీఓ కె. అచ్యుతానంద బాబు, ఏపీఓ ఎ. సావిత్రి, సర్పంచులు శశికళ, నరేష్, క్లస్టర్ ఇంచార్జి సోమర నారాయణస్వామి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రామానాయుడు, వినోద్, తలారి శివ, అశ్విని, పవన్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు జె. చంద్ర, హాజీవలి, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు