Homeఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం

ఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం

- Advertisement -

. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం
. వామపక్షాల ఐక్య ఉద్యమాలే శరణ్యం
. వర్గ రహిత సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం
. దేశంలో వామపక్షాలదే భవిష్యత్
. సీపీఐ సెమినార్‌లో రాజా, బేబీ, దీపాంకర్, దేవరాజన్, భట్టి

ఖమ్మం నుంచి ఏబీ కూన

దేశంలో అత్యంత ప్రమాదకరంగా ఫాసిస్టు శక్తులు విజంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి వామపక్షాలు ఐక్యమై, సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వామపక్షాలు ఏకం కాకపోతే దేశానికి భవిష్యత్తే ఉండబోదని హెచ్చరించారు. మతోన్మాద శక్తులు రాజ్యమేలుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని, మానవ హక్కులు మగ్యమయ్యాయని, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో హిట్లర్‌లా రూపాంతరం చెందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాటలో నడుస్తున్న నరేంద్రమోదీ తన ఉన్మత్త చర్యలతో దేశ సార్వభౌమత్వాన్ని, సాభ్రాతత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఇతర భావసారూప్యత గల పార్టీలను కలుపుకొని, ప్రత్యామ్నాయాన్ని సష్టించి, ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాలని విజ్ఞప్తి చేశారు. వామపక్షాల విలీనం లేదా ఐక్య ఉద్యమాలే శరణ్యమని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలోని ఎసఆర్ గార్డెన్స్‌లో మంగళవారం ‘నేటి భారతం`వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాల్గొని ప్రసంగించారు. దేశంలో నామపక్షాల భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న తరచూ వినిపిస్తున్నదని, నిజానికి ఈ దేశ భవిష్యత్ వామపక్షాలపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మునుపెన్నడు లేనంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాయని, ఆరఎసఎస్, బీజేపీతో ఈ దేశంలో స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలుగుతున్నదని, ‘సర’ పేరుతో ఓటు హక్కును, జనాభా లెక్కల పేరుతో అసలు జనాభా నుంచే తొలగించే కుట్రకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటున్నదన్నారు. ఐక్య ఉద్యమాలే ఫాసిస్టు శక్తులను అడ్డుకోగలవని వామపక్ష నేతలు పేర్కొన్నారు. ఈ దేశంలో మతోన్మాద శక్తులను నిలువరించగలిగే శక్తి, కార్మిక వర్గం పక్షాన పోరాడగలిగే శక్తి, ఆర్థిక అసమానతలు లేని, కుల రహిత సమాజాన్ని నిర్మించగలిగే శక్తి వామపక్షాలకే ఉందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మతతత్వ శక్తులను ఎదుర్కోవడంతో పాటు కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని లెఫ్ట్ నేతలు తెలిపారు. ఈ దేశంలో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల కోసం వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు చేసే కుట్రలను అడ్డుకుంటామని వారు తెలిపారు. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకుని, ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారతరాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు