Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు

చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల మూసివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరా లను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు కాగా… ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మంగళవారంహైకోర్టు విచారణ జరపగా… ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల కేసుల విచారణ న్యాయస్థానం ఉన్నప్పటికీ ఆదరాబాదరాగా ట్రయల్ (ఏసీబీ) కోర్టులోనే కేసుల మూసివేత జరుగుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో కేసులు ఎందుకు మూసేస్తున్నారు? ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు