Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసచివాలయ హెల్త్ కార్యదర్శి అకాల మరణం అత్యంత విషాదకరం

సచివాలయ హెల్త్ కార్యదర్శి అకాల మరణం అత్యంత విషాదకరం

- Advertisement -

ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా
విశాలాంధ్ర ధర్మవరం:: వైయస్సార్ జిల్లా కడపలోని గన్నవరం సచివాలయంలో విధులు కొనసాగిస్తున్న హెల్త్ సెక్రటరీ విజయకుమారి (42) అకాల మరణం అత్యంత విషాదకరమని ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పులిబండ్ల నర్సింహారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసంతకాలములో ఎండుటాకులు రాలినట్లు యువ ఉద్యోగులైన స్వర్ణ ఉద్యోగులు మృత్యువాత పడుతుండడం విషాదకరమని తెలిపారు. స్వర్ణ గ్రామ, వాడు ఉద్యోగులపై అతిగా పెరిగిన పరివారం, ఒత్తిడి, టార్గెట్ ట్రెజర్ వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పని భారం తగ్గించేరా తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే స్వర్ణ ఉద్యోగుల మరణాలపై సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తమ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ రూల్స్ అండ్ ప్రమోషన్ల విధానాలకు ఏర్పాటుచేసిన మంత్రుల ఉప కమిటీ ఈ అంశాలతో పాటు మరణాలపై కూడా దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ, వాడు ఉద్యోగులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు