Homeజిల్లాలుఅనంతపురంతమిళనాడు ప్రభుత్వ కీలక బాధ్యతలలో IAS అధికారి బోధపాటి చంద్ర మోహన్..

తమిళనాడు ప్రభుత్వ కీలక బాధ్యతలలో IAS అధికారి బోధపాటి చంద్ర మోహన్..

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ: తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన బోధపాటి చంద్రమోహన్ ఐఏఎస్ నియమితులయ్యారు. ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం ఆయన స్వగ్రామమైన లత్తవరంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్పతో పాటు బోధపాటి వారి కుటుంబ సభ్యులు బోధపాటి చంద్రమోహన్‌కు అభినందనలు తెలియజేశారు. తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పరిపాలనా పదవికి స్వగ్రామానికి చెందిన వ్యక్తి నియామకం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు