విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో పిబ్రవరి 15న జరగనున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, ఆవిష్కరణ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన స్వంత నిధుల నుంచి రూ.50 వేల నగదు విరాళాన్ని బుధవారం గ్రామస్థులకు అందజేశారు. గ్రామ దేవత ప్రతిష్ట వంటి పవిత్ర కార్యక్రమానికి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన యువత సమాజసేవలో భాగస్వాములవ్వాలనే సంకల్పంతో “యువత చారిటబుల్ ట్రస్ట్” పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ లోగోను నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత బాధ్యతగా మెలిగి సమాజంలో తమకు సాధ్యమైనంత సహాయం చేయాలని, పదిమందికి ఉపయోగపడేలా ఆలోచనలతో ముందుకు రావడం చాలా అభినందనీయమని అన్నారు. కంబదూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన సరస్వతి మాత, వరసిద్ధి వినాయక స్వామి ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని కళాశాల అధ్యాపక బృందం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే, కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి పాల్గొన్నారు.


