Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచెక్ బౌన్స్ కేసులో తీర్పు – నిందితుడికి జైలు,జరిమానా

చెక్ బౌన్స్ కేసులో తీర్పు – నిందితుడికి జైలు,జరిమానా

- Advertisement -

విశాలాంధ్ర, పెనుకొండ: 2022 సంవత్సరంలో ఆస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన భూమి విషయంలో యంగ్ కుక్ షైన్ (కొరియన్) మరియు పెనుకొండకు చెందిన కొండేపాగు గోపీనాథ్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో గోపీనాథ్, యంగ్ కుక్ షైన్‌కు రూ.20,00,000/- (ఇరవై లక్షలు) చెక్కు ఇచ్చినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి.అయితే ఆ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం, చెక్కు బౌన్స్ అయిన విషయం వాస్తవమని నిర్ధారించిన కోర్టు, నిందితుడికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 లక్షల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.ఈ తీర్పును పెనుకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బొజ్జప్ప ప్రకటించారని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే, నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రూ.2 లక్షల డిపాజిట్తో 30 రోజుల గడువును కోర్టు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు