Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్

కొడవలితో దాడి కేసు – ముద్దాయి అరెస్ట్

- Advertisement -

రౌడీయిజం చేయాలని చూస్తే తాటతీస్తాం.. డిఎస్పి హెచ్చరిక

విశాలాంధ్ర హిందూపురం:హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం, పులమతి పంచాయతీ పరిధిలోని సడ్లపల్లి గ్రామంలో ఈ నెల 19న ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన ఘటనలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ కె.వి. మహేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో సీఐలు జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, ఎస్సై నరేంద్రలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, హిందూపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె. మహేష్ ఆదేశాల మేరకు, హిందూపురం రూరల్ సీఐ కె. జనార్ధన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం లేపాక్షి మండలం పి. సడ్లపల్లి నుంచి తిలక్ నగర్‌కు వెళ్లే క్రాస్ రోడ్డువద్ద ఎస్సై నరేంద్ర, సిబ్బంది కలిసి ముద్దాయిని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన కొడవలిని నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 19న రాత్రి లేపాక్షి మండలం సడ్లపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణలో ముద్దాయి సాయి కుమార్, బాధితుడు ప్రవీణ్ కుమార్పై కొడవలితో దాడి చేయగా తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో జరిగే ఎటువంటి సంఘటనలైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు