Homeవిశ్లేషణదుష్ట చట్టాలను వ్యతిరేకిద్దాం

దుష్ట చట్టాలను వ్యతిరేకిద్దాం

- Advertisement -

కేవీవీ ప్రసాద్

భారతదేశ వ్యవసాయరంగం 146 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నది. దేశ జనాభాలో సుమారు 62 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగం నుండి ఏటా రూ.80 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. దీంతో వ్యవసాయరంగం పైన, భూములపైన స్వదేశీ, విదేశీ కార్పోరేట్ల కన్నుపడింది. కార్పోరేట్లతో దోస్తీ కట్టిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశప్రజలంతా కరోనా మహమ్మారి బారినపడి అల్లాడుతున్న సమయంలో అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చింది. ఆ చట్టాల ప్రమాదాన్ని గుర్తించిన రైతుసంఘాలు “సంయుక్త కిసాన్ మోర్చా”గా ఏర్పడి వాటి రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులు కేంద్రంగా “ఆసేతు హిమాచలం నుండి కన్యాకుమారి” వరకు దేశవ్యాపితంగా 13 మాసాల పాటు (383 రోజులు) కేంద్రప్రభుత్వం తెచ్చిన దుర్మార్గపూరిత చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం నిర్వహించాయి. దీంతో నరేంద్రమోదీ రైతాంగ వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 2021 డిసెంబరు 9న రైతు సంఘాలకు రాతపూర్వకంగా కేంద్రం ఇచ్చిన హామీని అమలుచేయకుండా ద్రోహపూరితంగా వ్యవహరించింది. మరో పక్క 2024లో నేషనల్ ప్రైమ్ వర్క్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, నేషనల్ కోఆపరేటివ్ పాలసీ, డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్‌ల పేర్లతో మూడు పథకాలను రూపొందించింది. గతంలో తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలకు ప్రతిరూపమే ఈ పథకాలు. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం పేరుతో యం.యస్.పి.ఊసే లేకుండా చేశారు. కేరళలో ఉన్నట్లుగా “పంటరుణ ఉపశమన చట్టం”ను పార్లమెంటులో చట్టాన్ని చేసి రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్టు వేయాలని కోరినా మోదీ పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలు వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందకుండా “ విత్తనచట్టం 2025”ను తెచ్చారు. పార్లమెంటులో “విద్యుత్ బిల్లు2023” చట్టం కాకుండానే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేసి విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ ఉంది. ఏటా కరువులు, తుఫానులు, అకాల, అధిక వర్షాల వలన రైతులు నష్టపోతున్నా కొద్దిపాటి ఇన్‌పుట్ సబ్సిడీ యిచ్చే విధానం కొనసాగుతూ ఉంది. “డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం`2005”లో సెక్షన్ 11, సెక్షన్ 12లను ఇటీవలే తొలగిస్తూ సవరణలు చేసినందున ఇన్‌పుట్ సబ్సిడీ, బ్యాంకులలో రుణాల వాయిదా ప్రక్రియలకు ఆస్కారం లేకుండాపోతుంది. భూమి లేని పేదలు, సన్నచిన్నకారు రైతులకు కొంతమేర పనిదినాలను కల్పించి అదనపు ఆదాయాన్ని చేకూర్చేలా ఆహార భద్రతను కల్పించాలని వామపక్షాల మద్దతుతో కూడిన మన్మోహన్‌సింగ్ నాయకత్వాన యుపిఎ ప్రభుత్వం “మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని” ప్రారంభించి నిరుపేదల జీవన పరిస్థితులను మెరుగుపరిచింది. అయితే నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప<ొáÅ·ంపైన కొన్ని విమsá్శలను చేస్తూ వుం&áfమే కాక కేటాయింపులను తగ్గించేశారు. ఇప్ప్పుడు ఈ పథకం స్థానంలో వికసిత్ భాsáత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చారు. ఇది సరైన చర్య కాదని, గత ప<ొáÅ·ంలోనే అవసరమైన కొన్ని మార్పులుచేసి అమలుచేjá§&áమే ఉత్తమమని విదేశీ సామాజిÅ·వేత్తలు, విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచించారు. ఐతే ఈ చట్టాన్ని” మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటు. కార్మికుల హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాల స్థానంలో మోదీ ప్రభుత్వం 4లేబర్ కోడ్లను తెచ్చింది. కార్మికుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి పారిశ్రామికవేత్తలకు అధిక లాభాలు చేకూరేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన మోదీ దానిపై సరైన చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలలో, సంస్థలలో 40లక్షల పోస్టులలో 8లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. స్వామినాథన్ సిఫార్సు సి2G50శాతం యంయస్‌పి అమలుచేయకపోవడం వలన భారత రైతాంగం ఏటా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. రైతులలో 86 శాతం మంది 5ఎకరాలలోపు నన్న, చిన్నకారు రైతులే. వీరిలో చాలామంది దారిద్రరేఖకు దిగువున ఉంటూ అప్ప్పులపాలవుతూ ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మరోపక్క బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాల పేరుతో ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. 2014లో రూ.56,000 కోట్లు ఉన్న గౌతమ్ ఆదానీ సంస్థల ఆస్తులు ఇప్ప్పుడు రూ.11.6లక్షల కోట్లకు చేరగా రూ.1.60 లక్షల కోట్ల సంపద ఉన్న ముఖేష్ అంబానీ సంపద ఇప్ప్పుడు 12లక్షల కోట్లకు చేరింది. ఇక భూములు కోల్పోతున్న రైతులు, వాటిపై ఆధారపడిన వ్యవసాయ కూలీల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు, పేదలు ముందుకొచ్చిన సందర్భాలలో వారిపైన తప్ప్పుడు కేసులు పెడుతున్నారు. అనకాపల్లి సమీపంలో ఫార్మా పార్కు, ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు బాసటగా నిలిచినందుకు రైతు నాయకుడు అప్పలరాజుపై పిడి యాక్టు కేసు పెట్టి జైలులో నిర్బంధించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జనవరి 26న గణతంత్ర దినోత్సవంలో భాగంగా రైతు, కార్మిక హక్కులను, ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ కార్పోరేట్లకు మేలు చేసే చట్టాలను ఉపసంహరించాలని డిమాండు చేస్తూ రైతు, కార్మిక గ్రామీణ పేదలు జనవరి 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు