Homeతెలంగాణనాంపల్లి అగ్నిప్రమాదంలో ఒకరు మృతి

నాంపల్లి అగ్నిప్రమాదంలో ఒకరు మృతి

- Advertisement -

నాంపల్లిలో నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నీచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. మంటల తీవ్రత తగ్గినా.. భవనం లోపలికి వెళ్లే వీల్లేకుండా పొగలు, తీవ్రమైన వేడి ఉండటం, పై కప్పు నుంచి శిథిలాలు ఊడి పడుతుండటంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. సుమారు 200 మంది భవనం గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లారు. నిన్నటి నుంచి భవనంలోపల ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. వారిలో ఒక మహిళ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. డెడ్ బాడీని అంబులెన్సులో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది. ఆ నలుగురు కూడా దట్టమైన పొగలో ఊపిరాడక మరణించి ఉంటారని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు