-జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
పాడేరు; గ్రామ సచివాలయ శాఖ జిల్లా నోడల్ అధికారి పి. యస్. కుమార్ అధ్యక్షతన మండలంలోని కిండంగి గ్రామంలో స్వచ్చంధ్ర – స్వర్ణంధ్రా కార్యక్రమంలో పాల్గొని, స్వచ్ఛ రధాలను ప్రారంభించారు. అనంతరం కిండంగిలో ఆధునీకరించిన చెత్త నుండి సంపద కేంద్రాన్ని నియోజక వర్గం ఇంచార్జి గిడ్డి ఈశ్వరి తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇల్లు శుభ్రంగాఉంచుకోవడమే కాకుండా, పరిసరాలు కూడాపరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,
ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు.
జిల్లాలో ప్రతీ మండలంలో కనీసం ఒక గ్రామ పంచాయతీలో సంపూర్ణ పారిశుధ్యము సాధించి , ఆదర్శ గ్రామంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు రోగాల బారిన పడకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిర్మించుకున్న వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా నిర్వహించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు
ప్లాస్టిక్, ఈ-వేస్ట్ సేకరణ కోసం ప్రతీ మండలానికి ఒక స్వచ్ఛ రధంకేటాయిస్తామని చెప్పారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు, పారి శుధ్య నిర్వహణకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అనంతరం పి4 కార్యక్రమం క్రింద ఒక నిరుపేద కుటుంబానికి ఆవు, దూడను అందించారు. కిండంగి గ్రామాన్ని పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు సంపద కేంద్రాన్ని ఆధునీకరించిన సర్పంచ్ శ్రీ లక్ష్మి, కార్యదర్శి అమృత ను అభినందించారు. కార్యక్రమంలో జి సి సి డైరెక్టర్ బొర్రా నాగరాజు, డిపిఓ చంద్రశేఖర్, యం.పి.డి.ఓ తేజా రతన్, వివిధ మండలాల డిప్యూటీ యం.పి.డి.ఓ లు పాల్గొన్నారు.


