–ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
విశాలాంధ్ర – మండపేట :కేశవరం గ్రామంలో ₹1.58 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తో కలిసి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో కొబ్బరికాయలు కొట్టి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు.


