–సీనియర్ న్యాయవాది బాలసుందరి
విశాలాంధ్ర ధర్మవరం; బాలికలకు గల చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ న్యాయవాది బాలసుందరి తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాలుర మునిసిపల్ ఉన్నత పాఠశాలలో
జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి , మండల న్యాయ సేవ అధికార సంస్థ ధర్మవరం శ్రీ టి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.బాల్య వివాహాన్నిషేధ చట్టం 2006 గురించి మరియు సమాజంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత బాల్యవివాహా నిషేధ అధికారులు ,సమాజ సంస్థల విధులుగురించి వివరించారు. బాలికల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. బాలవివాహాల వల్ల కలిగే చట్టపరమైన సామాజిక , ఆరోగ్యపరమైన ప్రతికూల పరిణామాలు గురించి కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రాంప్రసాద్ టీచర్స్ సిబ్బంది పాల్గొన్నారు
బాలికల చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES


