–అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి
పాడేరు : గిరిజన క్రీడాకారులకు ఎల్లప్పుడూ తను తన కుటుంబం అండగా ఉంటామని అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ ఇండోర్ స్టేడియం పున ప్రారంభోత్సవం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తో కలిసి అరకు ఎంపీ గుమ్మ తరుజారని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన క్రీడాకారులు ప్రోత్సహించడానికి ఎంపీ నిధుల నుండి 20 లక్షలు అందజేసినట్టు తెలియపరిచారు.
గిరిజన యువతకు క్రీడల్లో శిక్షణ పొందేందుకు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ స్టేడియం దోహదపడుతుందని తెలిపారు.
ఇండోర్ స్టేడియం పాడు అయినప్పటికీ గిరిజన క్రీడాకారులు క్రీడల్లో ముందుండాలని ఆలోచనతో అలాగే ఆటని కొనసాగించే దృశ్యం ఆమె కంటపడి ఆమెకు మరమ్మత్తులు చేయించాలనే ఆలోచన తట్టిందని తెలియపలిచారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో అంబేద్కర్ ఇండోర్ స్టేడియం పునః ప్రారంభం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు ఇండోర్ స్టేడియం ని సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ, మాజీ ఎమ్మెల్యే గిడ్డిశ్వరి, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి, స్కూలు యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


