Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు..

అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు..

- Advertisement -

భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్న గవర్నర్
చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దిన వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్ఠను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, కర్నూల్ ఏపీఎస్పీ రెండో బెటాలియన్ సహా వివిధ భద్రతా దళాలు గవర్నర్‌కు గౌరవ వందనం అందించాయి. వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. సామాజిక పెన్షన్లకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి 63 లక్షల మందికిపైగా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చుతున్నట్లు వెల్లడించారు. ‘దీపం్ణ పథకం ద్వారా పేద మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు.

ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రణాళికలు అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. నీటి భద్రతను ప్రధాన విధానంగా తీసుకుని పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ‘పొలం పిలుస్తోంది్ణ, ‘రైతన్న మీ కోసం్ణ వంటి కార్యక్రమాల ద్వారా నేరుగా మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు