Homeఆంధ్రప్రదేశ్మొక్కలతో రిపబ్లిక్ డే ఆకృతి

మొక్కలతో రిపబ్లిక్ డే ఆకృతి

- Advertisement -

పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలతో రిపబ్లిక్ డే ఆకృతి

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక పల్ల వెంకన్న నర్సరీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినూత్న మొక్కల కూర్పు దేశభక్తిని ప్రతిబింబిస్తోంది. త్రివర్ణ పతాకానికి ప్రతీకగా ఆకుపచ్చ నేపథ్యంపై పసుపు, ఎరుపు, తెలుపు రంగుల అలంకార మొక్కలు, అశోక చక్రం, ‘రిపబ్లిక్ డే’ సందేశం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు జాతీయ పండుగల విలువను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు నర్సరీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నర్సరీ అధినేత పల్ల సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొక్కలతో త్రివర్ణ స్ఫూర్తిని ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఈ ప్రత్యేక కూర్పు ఏర్పాటు చేశామని, ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి సంరక్షిస్తే అదే దేశానికి ఇచ్చే గొప్ప నివాళి అని అన్నారు. నర్సరీ డైరెక్టర్లు, యువ రైతులు వెంకటేష్, వినయ్ మాట్లాడుతూ రిపబ్లిక్ డే కేవలం పండుగ మాత్రమే కాదు, మన బాధ్యతను గుర్తుచేసే రోజు. ప్రకృతిని కాపాడుకుంటూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడమే దేశాభివృద్ధికి మార్గం అని పేర్కొన్నారు. నర్సరీలో ఏర్పాటు చేసిన ఈ మొక్కల కూర్పు యువతలో దేశభక్తితో పాటు పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సరీని సందర్శిస్తున్న ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ వినూత్న ఆకృతి వద్ద ఫోటోలు దిగుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు