మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు..
ఎంపీడీవో ప్రేమ్ సాగర్..
విశాలాంధ్ర – డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని మండల అభివృద్ధి శాఖ అధికారి ప్రేమ్ సాగర్ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టి మండల వ్యాప్తంగా ప్రతి పంచాయితీ, ప్రతి గ్రామంలో ఎటువంటి మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు మరమ్మతులకు గురైన బోర్లను మరమ్మత్తులు చేస్తున్నమన్నారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామ గిరిజనులు దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో మరమత్తుకు గురైన బోర్లు ఉంటే తక్షణమే ఎంపీడీవో కార్యాలయానికి సమాచారం అందించినట్లయితే బోర్లు మరమ్మత్తులు చేస్తామన్నారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మరమ్మత్తులు గురైన బోర్లను వచ్చే నెల ఫిబ్రవరి 1 నుంచి మార్చి 45 వరకు పాడైన బోర్లను మంచినీరు అందించేందుకు మరమ్మత్తులు చేస్తున్నామని ఎంపీడీవో ప్రేమ్ సాగర్ అన్నారు. ఈ అవకాశాన్ని మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామాల గిరిజనులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.


