Homeజిల్లాలుఅనంతపురంరాజ్యాంగ ఫలాలను చేరవేసే బాధ్యతను నెరవేరుద్దాం

రాజ్యాంగ ఫలాలను చేరవేసే బాధ్యతను నెరవేరుద్దాం

- Advertisement -

-ఎంపీడీఓ బి.విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు : భారత రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన సంక్షేమ ఫలాలను అక్కడ వర్గాల వారికి చేరవేసే బాధ్యతను కలిసికట్టుగా నెరవేరుద్దామని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ
కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓలు అశోక్ బాబు, అచ్యుతానందబాబు, ఏఓ భానురేఖ, ఎంఈఓతోపాటు సిబ్బందితోపాటు పాల్గొని ఎంపీడీఓ జెండా ఎగురవేశారు. డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ మనకు ఇచ్చిన రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతిఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అదేవిధంగా డీఎస్పీ కార్యాలయంలో సిబ్బంది, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బి. విజయకుమారి, సీఐ శ్రీహర్ష, వెటర్నరీ డాక్టర్ ప్రకాష్, లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి, ఏఓ కృష్ణచైతన్య, విద్యుత్ ఏఈ గౌస్ మొహిద్దీన్, హౌసింగ్ ఏఈ లావణ్య ఆయా కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగరవేసి వందనం స్వీకరించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లోనూ ఆయా హెచ్ఎంలు పేరెంట్స్ కమిటీ చైర్మన్ లు జాతీయ జెండాను ఎగరవేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు