Homeజిల్లాలుతూర్పు గోదావరితాటాకిల్లు దగ్ధం

తాటాకిల్లు దగ్ధం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలంలోని జేగురుపాడు నుండి మురమండ వెళ్ళు కాలువగట్టు రహదారి (జేగురుపాడు పంచాయతీ పరిధి) నందు సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో తాటాకిల్లు పూర్తిగా కాలి బూడిదయ్యింది. రెండు మోటార్ సైకిళ్లు, కొంత నగదు దగ్ధమైనట్లు సమాచారం. వలస కూలీలకు చెందిన నివాసంగా తెలియవచ్చింది. అగ్ని ప్రమాద సమయంలో నివాసితులు అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఏవిధమైన ప్రాణ నష్టం జరగలేదు. అనపర్తి అగ్నిమాపక వాహనం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎక్కువ మంది నివసిస్తున్నట్లు సమీప రైతులు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు