హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు పద్మావతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల గృపాలక బాలుర ఉన్నత పాఠశాల కు (ఎస్ పి సి ఎస్) పూర్వ విద్యార్థులు 160 బెంచిలు(ఐదు లక్షల విలువ) బహుకరణగా ఇవ్వడం జరిగిందని హెడ్మాస్టర్ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 1988-89,1990-91,1991-92 ఈ ముగ్గురు బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఐక్యమత్యంతో ఇవ్వడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన 6 మందిని కూడా ఘనంగా నిర్వహించడం అనేది ఎంతో సంతోషించదగ్గ, మరుపురాని ఘటన అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు పూర్వ విద్యార్థులు 160 బెంచీలు బహుకరణ
- Advertisement -
RELATED ARTICLES


