మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ (Ajit Pawar)కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తదితర రాజకీయ ప్రముఖులు అంతక్రియల్లో పాల్గొన్నారు. ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి పార్టీ అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో (Plane Crash) అజిత్ పవార్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. విమానం రన్‌వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. దీంతో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పవార్‌కు భార్య సునేత్ర పవార్ (రాజ్యసభ సభ్యురాలు), ఇద్దరు కుమారులు పార్థ్, జే ఉన్నారు.
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
- Advertisement -
RELATED ARTICLES


