Homeజిల్లాలువిజయనగరంసీతం కళాశాలలో సమగ్ర ఉద్యమశీలతపై కార్యశాల

సీతం కళాశాలలో సమగ్ర ఉద్యమశీలతపై కార్యశాల

- Advertisement -

విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : స్థానిక సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో మెకానికల్ విభాగం , ఎంటర్ప్రెన్యూర్ సెల్ ఆధ్వర్యంలో యువతకు పారిశ్రామిక రంగాలలో నైపుణ్యాలు ఎంపిక దిశగా సమగ్ర అవగాహనలపై కార్యశాల ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ డా. రీతూ మైతీ ( సీనియర్ ఇంజినీర్, సి టి టి సి,భువనేశ్వర్) హాజరై ,విద్యార్థులకు ఉద్యమశీలత (ఎంటర్ప్రన్యూర్షిప్) పై సమగ్ర అవగాహన కల్పించారు.ఇంజనీరింగ్లో ప్రతీ విభాగానికి సంబంధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, ఎమ్స్ఎంఈ అనే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ అందించే అద్భుతమైన అవకాశాలను వివరిస్తూ,ప్రతీ విద్యార్ధి ఉద్యోగం కోరేవాడిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వ్యక్తిగా మారాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అంకుర పరిశ్రమలు అంటే ఏమిటి?విద్యార్థులకు వినూత్న మైన ఆలోచాన రావడం వలన అది పరిశ్రమ నుంచి మార్కెట్ వరకు ఎటువంటి అభివృద్ధిని తీసుకొస్తుందని,ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, రిస్క్ టేకింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ వంటి పద్ధతులను వివరిస్తూ,ప్రభుత్వ సహాయ పథకాలు, ఎంఎస్ఎంఈ,స్టార్ట్ అప్ ఇండియా,స్కిల్ ఇండియా వంటి ట్రైనింగ్ సంస్థల్లో అవకాశాలను వివరిస్తూ, టెక్నికల్ నాలెడ్జ్‌ను వ్యాపారంగా మార్చుకునే విధానంను వివరించారు, కళాశాల ప్రధాన సంచాలకులు అయిన డా. మజ్జి శశి భూషణ రావు మాట్లాడుతూ ఉద్యోగం విలువ, వ్యాపార రంగాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు చదువుతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకోవాలని పిలుపునిచ్చారు.కళాశాల ప్రధాన అధ్యాపకులు డా . డి వి రామ మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తనలో ఉన్న సహజ సామర్థ్యాలను గుర్తించి వాటిని విద్య రంగానికి అమలు పరచడం వలన నూతన ఆవిష్కరణలకు దోహద పడతాయని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మెకానికల్ విభాగాధిపతి సిహెచ్ వెంకటలక్ష్మి సమన్వయం చేశారు.ఆమె ఉద్యోగ రంగానికి కావలసిన నైపుణ్యం ఇంజనీరింగ్ దశలోనే మంచి ట్రైనింగ్ కోర్సుల్లో నేర్చుకొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు