-వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్
ధర్మవరం పట్టణంలోని 10వ వార్డులో శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు అధ్యక్షతన చాంద్ బాషా, అమీర్ బాషా, జిలాన్ బాషా, సాదిక్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపి పార్టీ సంస్థాగత నిర్మాణంలో బాగంగా పార్టీ కోర్ కమిటీతో పాటు వివిధ అనుబంధ విభాగాలలో నియామకం చేశారు. వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూచనల మేరకు వైసిపి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా మనం అందరం ఇప్పటి నుంచే కష్టపడి ప్రజల్లో తిరుగుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా మీరు అందరూ కలిసి పనిచేయాలన్నారు. వైసిపి పార్టీ కోసం కష్టపడే కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు, సాధారణ ఏ ఎన్నికల్లో నైనా వైసిపి పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం అని వారికి పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం పై అందరూ చాలా క్రియాశీలకంగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్, కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు, చాంద్ బాషా, అమీర్ బాషా, జిలాన్ బాషా, సాదిక్, ఖాదర్ వలి, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


