Homeజిల్లాలువిజయనగరంనాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం

నాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం( విజయనగరం జిల్లా) : నాయీబ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టి. తిరుపతిరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. రవణమూర్తి పిలుపునిచ్చారు. రాజాంలో జరిగిన
రాజాం నియోజకవర్గం, జి.సిగడాం మండలాల నాయకులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా నాయీబ్రాహ్మణుల జీవన స్థితిలో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్, అర్హులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ రుణాలు, ఇల్లు లేనివారికి ఉచిత గృహాలు, 50 ఏళ్లు నిండిన ప్రతి నాయీబ్రాహ్మణుడికి పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పి. వెంకటరవణ, టి. అన్నారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు